మంచి గొఱ్ఱెల కాపరి
మంచి గొఱ్ఱెల కాపరి యోహాను సువార్త 10 వ అధ్యాయం లో వున్న సంగతులు యేసు క్రీస్తు ప్రభువు సువార్త ప్రకటిస్తూ ప్రజలకు వారి పాపాల నుంచి విడుదల, రక్షణ, నిత్య జీవం, పరలోక రాజ్యం గురించిన సంగతులు బోధిస్తూ సామాన్య ప్రజలకు కూడా అర్థం అయ్యేందుకు ఉపమానాలతో చాలా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు. యేసు క్రీస్తు ప్రభువు తనను తాను ఒక గొఱ్ఱెల కాపరిగా, సంఘంలో ఉన్న విశ్వాసులను గొఱ్ఱెల దొడ్డిలో వున్న గొఱ్ఱెలుగా పోల్చి వివరించడానికి ప్రయత్నం చేస్తూ వుంటాడు ఈ అధ్యాయం లో. ఎందుకంటే ఆ ప్రాంతాలలో గొఱ్ఱెల పెంపకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా వాటిని ఉదాహరణగా తీసుకొని చెబితే అర్థం అవుతుంది అనే ఉద్దేశ్యం తో ఈ విధంగా చెప్పాడు ఆయన. మనం బైబిల్ లో పరిశీలించినా… మొదట నుంచి చూసినా… యాకోబు, మోషే, దావీదు ఇలా చాలామంది గొర్రెల కాపరులే. యోహాను 10:4 - మరియు అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. వెలుపలికి నడిపించునపుడెల్ల - అని వుంది కదా. ఎందుకు బయటికి తోలుకొని వెళ్లేటప్పుడు ప్రతీ సారి వాటికి ముందుగా నడవాలి? గొఱ్ఱెల...