నెమరు వేయుట || Chewing the cud || Rumination
నెమరు వేయుట దేవుడైన యెహోవా తనకు దహన బలిగా అర్పించబడే జంతువులు ఏవో చెబుతూనే.. వాటికి కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకున్నాడు. లేవీయకాండము 1:2 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము – మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు, గోవుల మందలో నుండిగాని గొఱ్ఱెల మందలో నుండిగాని మేకల మందలో నుండిగాని దానిని తీసికొని రావలెను. లేవీయకాండము 11:3-4 [3] జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చునుగాని [4] నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు... పవిత్రమైన జంతువులుగా ఉన్న వాటికి ఉన్న రెండు లక్షణాలలో నెమరువేసే లక్షణం ఒకటి. పవిత్రమైన మరియు దేవుడు కోరుకున్న గోవు, మేక, గొఱ్ఱె లలో వున్న నెమరు వేసే స్వభావం గురించిన విషయాలు తెలుసుకుందాం. రెండు డెక్కలు గల స్వభావం గురించి మరొక వ్యాసంలో వ్రాయబడి వుంటుంది గమనించండి. నెమరు వేసుకోవడం అంటే - జంతువులు మేత దొరికినప్పుడు తిని, తరువాత తీరికగా వున్నప్పుడు ఆ ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకొని నిదానంగా పూర్తిగా నమిలి మింగుతాయి. అలా చేయడం వలన అందులోని పోషకాలను అవి పూర్తిగా గ్రహించగలవు. ఈ ప్రక్రియ నుంచి మనం నేర్చుకోవలసిన విషయ...